by Suryaa Desk | Mon, Dec 30, 2024, 05:29 PM
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పార్టీకలతీతంగా ధర్మ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ ఐక్యంగా ఉండాలని సోమలింగ శివాచార్య మహారాజ్ అన్నారు. బిచ్కుందలో ఆదివారం నిర్వహించిన జుక్కల్ నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సమాజ్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ మృతికి సంతాపం పాటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజం ఐక్యంగా ఉండి అభివృద్ధిలోకి రావాలన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఊరి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మల్లికార్జునప్ప షెట్కార్,మాజీ ఏఎంసీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావ్ పటేల్ మరియు నియోజకవర్గ వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు.