by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:46 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 2025 కొత్త ఏడాది నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం... ప్రస్థానం ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని, మనసారా కోరుకుంటూ అందరికీ 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21 నుంచి దావోస్‌లో పర్యటించనున్నారు. అంతకంటే ముందు జనవరి 13 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలో, జనవరి 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు.