by Suryaa Desk | Tue, Dec 31, 2024, 11:09 AM
భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తెల్లవారుజామున ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ క్రమంలోనే గౌడౌన్లో ఎగసిపడుతోన్న మంటలను చూసిన స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం స్పాట్కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, రాత్రి వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.