by Suryaa Desk | Tue, Dec 31, 2024, 09:53 PM
కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో షాపింగ్ కాంప్లెక్స్ కోసం స్థలం కేటాయిస్తే అది నేడు కబ్జా దారుల పాలయిందని ఉమా మహేష్ అన్నారు. అధికారులు కబ్జాలకు అరికట్టకుండా కబ్జాదారులకు పట్టా ఉంది కాబట్టి కడుతున్నారని సదరు అక్రమార్కులకు వత్తాసు పలకడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. సదరు కబ్జాదారులు జిఓ58 ప్రకారం వారికి 348/1 సర్వే నంబర్లో పట్టా ఉందని కబ్జా దారుల పంతాన చేరడం, కబ్జాలను నివారించకుండా కబ్జాదారులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. పేద ప్రజలు ఇలా పట్టాలు ఉండి స్థలం లేని ప్రజలు చాలామంది ఇళ్లు లేని వారు ఉన్నారని తమ ఇష్టానుసారంగా కబ్జాలు చెస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
గతంలో ఇక్కడ కేవలం ఒక్క మాత్రమే ఉందని నేడు మొత్తం స్థలం మాదే అంటూ కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదే స్థలంలో గత నెలలో ఆర్ ఐ నిర్మాణాలను అడ్డుకున్నారని, మళ్ళీ నేడు అదే అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. అధికారులు కబ్జాలకు ప్రోత్సాహిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, కావున అధికారులు అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ప్రజావాణిలో కలెక్టర్ కు, హైడ్రా కమీషనర్ కు పిర్యాదు చేస్తామని అక్కడ ప్రజలకు ఉపయోగపడేవిదంగా ఉండేలా ఏర్పాటు కావడానికి పోరాటం చేస్తామని హెచ్చరించారు.