by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:21 PM
మండల వ్యాప్తంగా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సోమవారం ఎస్సై నరేష్ తెలిపారు. డిసెంబర్ 31 వ తేదీ వేడుకల ముందస్తు చర్యల్లో భాగంగా రాత్రి ఎలాంటి ఇబ్బందికర సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వేడుకలను జరుపుకోవాలని ఎస్ ఐ నరేష్ సూచించారు.
ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆకస్మిక వాహనల తనిఖీలు నిర్వహించబడతాయని, డిజే సౌండ్ బాక్స్ లకు అనుమతి లేదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రివేళ వేడుకల కోసం బయటకు పంపించి ఇబ్బందులు పడొద్దని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ప్రజలు కుటుంబ సమేతంగా తమ నివాసాల్లోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని మండల ప్రజలకు సూచించారు.