by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:04 PM
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2025 క్యాలెండర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ కట్ చేయించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.