by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:32 PM
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం, మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో ఉన్న ఇసుక రిచ్ వాగులను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. పాలసీ ప్రకారం మాత్రమే ఇసుక రవాణా జరగాలన్నారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా పక్కాగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులకు ఆదేశించారు. వారి వెంట జిల్లా మైనింగ్ అధికారి జై సింగ్ పాల్గొన్నారు.