by Suryaa Desk | Wed, Jan 01, 2025, 12:39 PM
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.నిన్నటి ధరతో పోలిస్తే 2025 ఏడాది మొదటిరోజు బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,500 (22 క్యారెట్స్), రూ.78,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 అధికమై రూ.78,150 వద్దకు చేరింది.
సిల్వర్ ధరలు
ఏడాది ప్రారంభ రోజు బుధవారం బంగారం ధరలు పెరిగినట్లుగా వెండి ధరల్లో మార్పులేమి రాలేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర మారకుండా స్థిరంగా కేజీకి రూ.98,000 వద్దే ఉంది.