by Suryaa Desk | Wed, Jan 01, 2025, 10:38 AM
ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రకు రైలులో సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారని సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావీద్ తెలిపారు.మంగళవారం సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జావీద్, రైల్వే పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు వివరాలను వెల్లడించారు. ఒడిశా లోని గాజపాటి జిల్లా ఘాసాపాడ గ్రామానికి చెందిన సర్భన్ నాయక్ (29) ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తాడు.అదే గ్రామానికి చెందిన తఫాన్ బిషోయో (27)తో పాటు మానస్ ఒడిశాలో రూ.1.22 లక్షల విలువ చేసే 4.9 కిలోల గంజాయి కోనుగోలు చేశారు. అక్కడినుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు లో సరఫరా చేస్తుండగా మంళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బెర్తు కింద ఉన్న లగేజీలను పరిశీలించగా అందులో గంజాయి సరుకు ఉందని తెలుసుకున్న పోలీసులు ముందుగా సర్భన్ నాయక్, తఫాన్ బిషోయోలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన మానస్ అక్కడి నుంచి పారిపోయాడు. గంజారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.