by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:08 PM
ఆర్చరీ క్రీడాకారుడికి కాంపౌండ్ బో అందజేసిన...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జిల్లాలో క్రీడలకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో ప్రతిభా వంతుడైన ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ రావు కు కాంపౌండ్ బో పంపిణీ చేశారు.
రామగుండం నగరానికి చెందిన ధీరజ్ రావు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఆర్చరీ తనకు కాంపౌండ్ బో కావాలని జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.విద్యార్థి దరఖాస్తు పరిశీలించిన జిల్లా కలెక్టర్ 4 లక్షల 43 వేల 300 రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థినికి అవసరమైన కాంపౌండ్ బో కొనుగోలు చేసి నేడు పంపిణీ చేశారు. విద్యార్థిని భవిష్యత్తులో ఆర్చరీ లో గొప్ప క్రీడాకారిణీగా ఎదగాలని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు తోడ్పాటు జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి కొమ్ము రోజు శ్రీనివాస్, పేట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి సురేందర్, డి రమేష్ ,ధీరజ్ రావు తల్లిదండ్రులు ,తదితరులు పాల్గోన్నారు.