by Suryaa Desk | Tue, Dec 31, 2024, 10:41 AM
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం 8 గంటలకు కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలికి తోడు దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో రోడ్లపై వెళ్లే వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. సంక్రాంతి పండుగ అనంతరం చలి తీవ్రత కొంచెం తగ్గే అవకాశాలున్నాయి.వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 84 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 70 డిగ్రీల సెల్సియస్ ఉంది.హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 84 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 69 డిగ్రీల సెల్సియస్ ఉంది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 91 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 75 డిగ్రీల సెల్సియస్ ఉంది.విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 81 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 74 డిగ్రీల సెల్సియస్ ఉంది.