by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:10 PM
క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు అన్నారు. మెట్ పల్లి పట్టణ ప్రాంత ప్రజలకు సేవలు అందించే 108 అంబులెన్స్ పాత పడిపోవడంతో దాని స్థానంలో ప్రభుత్వం నూతన అంబులెన్స్ ను కేటాయించింది. సోమవారం నూతన అంబులెన్స్ ను కృష్ణారావు తోపాటు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత అంబులెన్స్ వల్ల ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం నూతన అంబులెన్స్ ను కేటాయించిందని పేర్కొన్నారు. ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పార్టీ నాయకులు అల్లూరి మహేందర్ రెడ్డి, జెట్టి లక్ష్మణ్, తుమ్మనపల్లి రాంప్రసాద్, మార్గం గంగాధర్, ముఖిమ్, బత్తుల భరత్, ప్రసాద్, చిరంజీవి, నాని సురేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.