by Suryaa Desk | Wed, Jan 01, 2025, 11:36 AM
కొత్త సంవత్సరం వేడుకలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చిన్నా, పెద్దా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగస్వాములై..కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక న్యూ ఇయర్ సంబురాలు ముగియడంతో.. బుధవారం ఉదయం నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. నూతన సంవత్సరం రోజున తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, అంతా శుభం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇక భక్తుల తాకిడిని ముందే ఊహించిన ఆలయాల అధికారులు.. వారి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.తెలంగాణలోని యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, జోగులాంబతో పాటు ఇతర ఆలయాలకు భక్తులు బారులు తీరారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. హైదరాబాద్ నగరంలోని చిలుకూరు బాలజీ టెంపుల్, బిర్లా మందిర్, పెద్దమ్మ తల్లి ఆలయం, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్‌లోని టీటీడీ ఆలయాలు, పద్మారావు నగర్‌లోని స్కంధగిరి టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు