by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:30 PM
నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద మంగళవారం సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జెఎసి నాయకులు ఎల్లాగౌడ్ తెలిపారు. ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని డిమాండ్ చేశారు.