by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:00 PM
మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరం ఆధ్వర్యంలో, మండల స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభా పాటవ పోటీ పరీక్ష గూడూరు బాలుర ఉన్నత పాఠశాలలో, ఈ కార్యక్రమాన్ని మండల సోషల్ ఫోరం కన్వీనర్ డాక్టర్ జి.చంద్రమౌళి నిర్వహించారు. మండలంలోని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చందా, ఉమారాణి, సులోచన, రవి, అశోక్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదాశివ పాల్గొన్నారు.
ఈ పరీక్షలో ప్రథమ స్థానం బి. సావిత్రి జెడ్పిహెచ్ఎస్ పొనుగోడు, ద్వితీయ స్థానం డి. దేవేందర్ బాలుర ఉన్నత పాఠశాల గూడూరు, తృతీయ స్థానం జి. దివ్య ఎం జె పి గురుకులం గూడూరు లు గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులు జనవరి 4న మహబూబాబాద్ లో, జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర ప్రతిభాపాట పరీక్షలు పాల్గొంటారు. విజేతలను మండల విద్యాశాఖ అధికారి జె. రవికుమార్ అభినందించారు.