by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:31 PM
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జైరాం నగర్ లో నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడంతో మంగళవారం బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి, కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, బాబీ నీలా, కృష్ణ వేణి, సత్యనారాయణ, మాధురి, జాన్, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.