by Suryaa Desk | Tue, Dec 31, 2024, 02:12 PM
నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్‌జోన్‌లోని నిర్మాణాలకు కూల్చివేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ఇటీవల ఈ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.కాగా, భగీరథమ్మ చెరువు నానక్‌రామ్ గూడా సర్వే నంబర్ 150, 151లో, రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నంబర్ 450, 451లో సుమారు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండు మండాలల పరిధిలోని నానక్‌రామ్ గూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ విస్తరించి ఉంది. 2013లో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దుల ప్రకారం ఈ చెరువు (లేక్ ఐడీ 2924) మొత్తం 54 ఎకరాల్లో ఉండగా, అందులో 2013, అక్టోబర్ నాటికి 48 ఎకరాల మేర నీరు ఉందని పేర్కొంటూ ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు మ్యాప్ తయారు చేశారు. అయితే గత కొంతకాలంగా విచ్చలవిడిగా కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువును ఎండబెట్టి మరీ శిఖం స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి