by Suryaa Desk | Wed, Jan 01, 2025, 02:34 PM
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తెల్లవారు జామున తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయన వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేశారు. బుధవారం తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకున్న భట్టి.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం సత్రంలోని భోజనంపై తన అభిప్రాయాలను అక్కడే ఉన్న రికార్డుల్లో డిప్యూటీ సీఎం భట్టి రాశారు. కాగా ఈ రోజు తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకున్న భట్టి.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆయనతో టీటీడీ అధికారులు ముచ్చటించారు. అలాగే ఆలయ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.