by Suryaa Desk | Wed, Jan 01, 2025, 04:31 PM
తెలంగాణలో గత ఏడాది చివరి నెల... డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రూ.3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు అమ్మకాలు రోజు రోజుకూ పెరిగాయి. ఈ కొద్ది సమయంలోనే రూ.1,700 కోట్ల అమ్మకాలు జరిగాయి.2023లో ఇదే సమయంతో పోలిస్తే రూ.200 కోట్ల పెరుగుదల నమోదైంది. డిసెంబర్ 30న అయితే ఏకంగా సగటున రోజువారీ సేల్స్ కంటే రెండింతల ఎక్కువ సేల్స్ జరిగాయి. 23వ తేదీ నుంచి 31 వరకు రోజువారీగా మద్యం అమ్మకాలు ఇలా ఉన్నాయి.డిసెంబర్ 23న రూ.193 కోట్లు, డిసెంబర్ 24న రూ.197 కోట్లు, డిసెంబర్ 24న రూ197 కోట్లు, డిసెంబర్ 26న రూ.192 కోట్లు, డిసెంబర్ 27న రూ.187 కోట్లు, డిసెంబర్ 28న రూ.191 కోట్లు, డిసెంబర్ 30న రూ.402 కోట్లు, డిసెంబర్ 31న రూ.282 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి.