by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:28 PM
నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. 31న రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. బ్రీత్ అనలైజర్ లతో తనిఖీలు నిర్వహిస్తామని, గంజాయి, డ్రగ్స్, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజల దృష్టికి వస్తే డయల్ 100, కంట్రోల్ రూమ్ 8712659360 సమాచారం అందించాలన్నారు.