by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:25 PM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద వేలం పాటలో దక్కించుకున్న టెండర్ దారులు లడ్డు, పులిహోరలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్ స్పెక్టర్ విజయలక్ష్మి అన్నారు.సోమవారం జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ ఆలయం వద్ద దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటను నిర్వహించారు. గత పది రోజుల క్రితం అధికారులు కొబ్బరికాయలు, ఓడిబియ్యం, దుకాణ సముదాయంలకు, కొబ్బరి ముక్కలు, పూజా సామాగ్రిలకు బహిరంగ వేలం నిర్వహించారు. కాగా లడ్డు, పులిహోర, రెండు షాపులకు టెండర్లు, దేవాలయం ముందు పూల దండలు, ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాల అలంకరణ, కిరాణం సప్లైకి గత పది రోజుల క్రితం టెండర్లు నిర్వహించినప్పటికి ఎవరు ముందుకు రాకపోవడంతో సోమవారం అధికారులు వాయిదా పడ్డా టెండర్లను పిలిచారు. ఈ వేలంలో లడ్డు, పులిహోర ను తిగుల్ నర్సాపూర్ కి చెందిన ప్రశాంత్ రూ.26.30లక్షలకు, దేవాలయం ముందు పూల దండలు అమ్మకానికి అశోక్ రూ.16వేలు, షాపు నెంబర్3ను సత్యనారాయణ రూ.16వేలు, షాపు నెంబర్ 4 ను పోచయ్య 72వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్ స్పెక్టర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ...ఆలయం వద్ద లడ్డు, పులిహోర ను దక్కించుకున్న టెండర్ దారులు నాణ్యత గా తయారు చేసి విక్రయించాలని సూచించారు.
లడ్డు పులిహోర లో నాణ్యత పాటించకుంటే డిపాజిట్ రద్దు చేస్తామని తెలిపారు. టెండర్ ద్వారా అమ్మవారికి రూ.27.80లక్షల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. జనవరి 13నుండి అమ్మవారి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని రంగులతో అందంగా అలంకరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్, సినియర్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రజీత రమేష్, సిబ్బంది కనకయ్య, హరి బాబు, మాజీ చైర్మన్ లక్ష్మి నరసింహ రెడ్డి, డైరెక్టర్ లు చెక్కల నరేశ్, లింగాల వజ్రమ్మ రఘుపతి తదితరులు ఉన్నారు.