by Suryaa Desk | Tue, Dec 31, 2024, 06:55 PM
హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైంది. ఈ మేరకు పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో నేటి రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అదనపు ట్రాఫిక్ పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ వెల్లడించారు. వాహనాదారులు ఈ విషయాలను గమనించి సహకరించాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు. బేగంపేట్, టోలిచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మూసివేస్తామన్నారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లైఓవర్‌పై విమాన టికెట్లు ఉండి, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నట్లు చెప్పారు.
ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతి ఉండదన్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు ఉంటాయని చెప్పారు. రాత్రి 10 గంటల నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు నగర పరిధిలోకి అనుమతి ఉండదన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేటు బస్సులు ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ట్యాంక్‌బండ్‌కు కాలినడకన వెళ్లాలనుకునే సందర్శకులు వెహికల్స్ సెక్రటేరియట్ విజిటర్స్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన హెచ్‌ఎండీఏ గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రేస్ కోర్స్ రోడ్డు (ఎన్టీఆర్ ఘాట్ పక్కన), ఆదర్శనగర్ లేన్ (బైక్‌లు మాత్రమే) వద్ద పార్క్ చేయాల్సి ఉంటుందన్నారు.
ట్రాఫిక్ డైవర్ట్ చేసే ప్రాంతాలు.. అప్పర్ ట్యాంక్‌బండ్, లిబర్టీ, నల్లగుట్ట ఎక్స్ రోడ్స్, మినిస్టర్ రోడ్డు, పీవీఎన్‌ఆర్ మార్గ్, రాణిగంజ్, దోభిఘాట్, చిల్ట్రన్స్ పార్క్, బుద్ధభవన్, కర్బలా మైదాన్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్స్, సీజీఓ టవర్స్, సెయిలింగ్ క్లబ్ జబ్బార్ కాంప్లెక్స్, వీవీ విగ్రహం, రాజ్‌భవన్‌వైపు, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదన్ కళాశాల, సచివాలయం, పాత అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్,ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ జంక్షన్, మర్రి చెట్టు, ప్రింటింగ్ ప్రెస్, మింట్ కాంపౌండ్ లేన్, ఖైరతాబాద్ బడా గణేష్, మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్షేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపూల్, పాత అంబేడ్కర్ విగ్రహం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయన్నారు.