by Suryaa Desk | Tue, Dec 31, 2024, 09:56 PM
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని గాజులరామరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్ ఆద్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ 2006వ సంవత్సరంలో తన తల్లి కూన మహాలక్ష్మి పేరు మీదుగా వడ్డెర పేద ప్రజల గృహ నిర్మాణం కోసం ఉచిత పట్టాలు పంపిణీ చేశానని, అధికారంలో ఉన్నా లేకున్నా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని.. అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, జాతీయ యువజన అధ్యక్షులు రమేష్ ముంజల్కర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రమ, రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు సాతాల గోపాల్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నగేష్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు బొంత చిరంజీవి, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షులు ఎస్ మురళి, జిహెచ్ఎంసి ప్రధాన కార్యదర్శి చిన్న మరియు నియోజకవర్గ వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.