by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:45 PM
జనవరి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో ఈ నెల 30 వ తేదీన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాప దినాల్లో భాగంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.దీంతో ఆరోజు తలపెట్టిన తెలంగాణ కేబినెట్ భేటీని వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటిని జనవరి 4వ తేదీన నిర్వహించనున్నారు. జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు 12 వేల ఆర్థిక సాయం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పై చర్చించే అవకాశం ఉంది. దీంతో ఈ కేబినెట్ భేటీ పై ఆయా వర్గాలలో ఆసక్తి నెలకొంది.