by Suryaa Desk | Wed, Jan 01, 2025, 11:48 AM
ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులు, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చకదిద్దుకోవాలని అభిలషించారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.