by Suryaa Desk | Tue, Dec 31, 2024, 05:20 PM
హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు జేసీబీలతో కూల్చివేయిస్తున్నారు. ఈ చెరువు బఫర్ జోన్‌లోని రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో ఇటీవల ఆక్రమణదారులు రేకుల షెడ్లు నిర్మించారు.ఈ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి భగీరథమ్మ చెరువు వద్దకు చేరుకొని జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.