by Suryaa Desk | Tue, Dec 31, 2024, 11:51 AM
న్యూ ఇయర్ వేళ పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. సోమవారంతో పోలిస్తే నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 440 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,100గా ఉండగా 24 క్యారెట్ల ధర రూ.77,560గా నమోదైంది. అలాగే వెండి కేజీపై నేడు ఏకంగా రూ. 2000 తగ్గి రూ. 98,000గా కొనసాగుతోంది.