by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:18 PM
ఈరోజు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామంలోని ఎస్సి కాలనీ లో పౌరహక్కుల దినోత్సవం ఎస్ ఓ శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసిల్దార్ పల్లకొండ రవి, హాజరై మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మాణం చేయాలని, అంటరానితనం రూపుమాపి సమానత్వం కొరకు సామాజిక చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే అందరూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్దిలో ముందుండాలని అన్నారు.
ప్రజల వద్ద నుండి వచ్చిన వినతులను స్వీకరించి తగిన పరిష్కారం చేస్తామన్నారు, అనంతరం పౌరహక్కుల ప్రతిజ్ఞ చేయడం జరిగింది, అనంతరం మీటింగ్ వద్ద సహపంక్తి భోజనం చేయడం జరిగింది, ఇంకా ఈ కార్యక్రమంలో ఏ పి ఎం శ్రీనివాస్ గారు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ ,& మానిటరింగ్ సభ్యులు మాంకాల యాదగిరి, సీసీ శారదా , పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ అంగన్వాడీ టీచర్ బుజ్జమ్మ, ఆశా వర్కర్ మమత, సి ఇ అసిస్టెంట్ రాజేష్, సి ఏ షాహీదా బేగం, మాజీ సర్పంచ్ చంద్రమౌళి , గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.