by Suryaa Desk | Wed, Jan 01, 2025, 11:31 AM
AP: తిరుమల శ్రీవారిని మంగళవారం తెలంగాణకు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయకుమార్ దర్శించుకున్నారు. బ్రేక్ దర్శన సమయంలో ఆయన దర్శనానికి వచ్చారు. హోప్ ఫౌండేషన్ అధినేత అయిన ఆయన సుమారు ఐదు కిలోల బరువు, రూ. నాలుగు కోట్ల విలువ ఉన్న బంగారు నగలతో తిరుమలకు చేరుకున్నారు. దీంతో భక్తులు ఆయనను ఆసక్తిగా తిలకించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం వెలుపల ఆయనతో సెల్ఫీ దిగడానికి జనం ఎగబడ్డారు.