by Suryaa Desk | Tue, Dec 31, 2024, 04:07 PM
ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవి అన్నారు. సోమవారం పట్టణంలోని బిసి బాలికల వసతి గృహంలో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన బాధ్యత ఎంతైన ఉందన్నారు.
వాహనాలు నడిపే వారు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలని, అంతే కాకుండా మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే పరిణామాల గురించి తెలియచేసారు. మనతో పాటు మన ఇంటి వారికి, మన వాళ్లందరికి తప్పకుండా రోడ్డు భద్రత నియమాల గురించి తెలియచేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఆమె వెంట వసతి గృహం వార్డెన్ యేసుమని, ట్రాన్స్పోర్టు సిబ్బంది, తదితరులున్నారు.