by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:36 PM
న్యూ ఇయర్ వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే మద్యం అమ్మకాల ద్వారా రూ. 402 కోట్ల 62 లక్షల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. డిసెంబర్ 31 నేపథ్యంలో నిన్నటి నుంచే బెవరేజ్ శాఖ నుంచి భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మద్యం దుకాణాలకు భారీగా లిక్కర్ చేరింది. నిన్న 3,82,265 కేసుల లిక్కర్, 3,96,114 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఇవాళ లిక్కర్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.డిసెంబర్ 31న వైన్స్ షాపులు సమయ వేళలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా తెల్లవారుజామున 1:00 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ మార్పులను ధృవీకరిస్తూ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.