by Suryaa Desk | Tue, Dec 31, 2024, 01:23 PM
మహిళల నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధని,బాలికల చదువుతోనే సమాజ మార్పుకు నాంది, బాలికలు సామాజిక రుక్మాత్తులపై అవగాహన కలిగి ఉండాలని క్రై స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జెర్ర ప్రతాప్, మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు దేశబోయిన నర్సింలు, బాలల పరిరక్షణ అధికారి బూరుగుపల్లి రాజు అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రం కేజీబీవీ పాఠశాలలో బాలల పరిరక్షణ, హక్కులు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో బాలలు మహిళ పై అనేక అరాచకాలు అత్యాచారాలు జరుగుతున్నాయని వాటి నివారణ కోసం ప్రజలందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస అవుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాగే విద్యార్థులు, పిల్లలు మొబైల్ ఫోన్ చూడడం సర్వసాధారణమైందని వారు మొబైల్ ఫోన్ లో ఏలాంటి యాప్ లు ఓపెన్ చేస్తున్నారు.
మొబైల్ దేనికోసం ఉపయోగిస్తున్నారు మొబైల్ వలన అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. బాలలకు రాజ్యాంగం ప్రకారం వారికి హక్కులు చట్టాలు కల్పించబడ్డవి వాటిని పొందే అధికారం బాలలకు ఉన్నాయన్నారు. వారి హక్కులకు భంగం కలిగించకుండా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. రాజ్యాంగం వారికి ముఖ్యంగా కొన్ని హక్కులను కనిపించింది. బాలలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు ,భాగస్వామ్యపు హక్కు వీటితోపాటు బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, చట్ట వ్యతిరేకంగా పిల్లల అమ్మకం కొనడం ,బాల్యవివాహాల నిరోధక చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, జీవినియల్ జస్టిస్ యాక్ట్, పిల్లల రక్షణ కోసం వారి సమస్యలపై ఫిర్యాదు చేయడానికి చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని ఎంచుకొని అది సాధించే వరకు కష్టపడి చదవాలన్నారు.బాల కార్మికుల నిర్మూలన, బాల్యవివాహాలు జరిగితే కలిగే పరిణామాలపై బాలికలకు అవగాహన కల్పించడం జరిగిందని, మహిళల నైతిక అభివృద్దే దేశాభివృద్ధి అని బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించారు. దేశంలో మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే, అబ్దుల్ కలాం లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని పురుషులతో పాటు సమానంగ మహిళలు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఇన్చార్జి ఎస్ఓ శ్రీలత, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, జర్నలిస్టులు కనక స్వామి, కొంగర శ్రీనివాస్, కేజీబీవీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.