by Suryaa Desk | Tue, Dec 31, 2024, 03:45 PM
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌కు వర్తించవని హైకోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణ ఒప్పందంలో అధికారి సంతకం చేసినట్లు చెప్పారు. ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు.ఈ వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని కోర్టుకు తెలిపారు. అవినీతి జరిగినట్లుగా కూడా ఆధారాలు చూపించలేదని వెల్లడించారు. వాదనల సందర్భంగా పలు తీర్పులను సిద్ధార్థ దవే చదివి వినిపించారు. కేటీఆర్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేయాలని కోరారు. కాగా, భోజనం విరామం తర్వాత ఏజీ వాదనలు వినిపించనున్నారు.