by Suryaa Desk | Sun, Dec 29, 2024, 03:10 PM
నర్సంపేట నియోజకవర్గంలో బిజేపి పార్టీ లో చెన్నరావు పేట్ మండలం కాల్ నాయక్ తండ నుండి యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు అధ్వర్యంలో కాల్ నాయక్ తండ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకులు గుగులోత్ నరేష్, బానోత్ రవి, బానోత్ రమేష్ గార్లు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం బిజెపిదే అని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రజల తరపున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని నర్సంపేట గడ్డమీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేద్దాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొంకేస విగ్నేష్ గౌడ్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు సందీప్ బిజెపి నాయకులు అబ్బరబోయిన రాజు, ప్రవీణ్, గార్లు పార్టీ నాయకులు, యువ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.