by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:12 PM
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల డిప్యూటీ తహసీల్దార్(డిటి)ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ శనివారం ఏసిబి అధికారులకు చిక్కాడు.ఏసిబి డిఎస్పి రమణమూర్తి తెలిపిన వివరాల మేరకు..శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన కలకుంట్ల నవీన్ రావు అనే రైతు తనకున్న 2 ఎకరాల 25 గుంటల భూమిని నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే లంచం ఇవ్వాలని డిటి ఇంద్రాల మల్లేశం రైతును డిమాండ్ చేశాడు.డిటి లంచం డిమాండ్ చేయడంతో రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.రైతు నవీన్ రావు నుంచి డిటి మల్లేశం రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే తహసీల్దార్ కార్యాలయం వద్ద మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.కెమికల్ టెస్టులు నిర్వహించి వాంగ్మూలాలు తీసుకుని మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు.ఏసీబీ దాడుల్లో డిటి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం మండలంలో చర్చనీయాంశంగా మారింది.