by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:13 PM
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 15వ డివిజన్ లో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గాజుల సుజాత పత్తి కుంట చెరువు వద్ద దోబీ ఘాట్ నిర్మాణము, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ లో ప్రహరీ గోడ, బోర్ వెల్ వసతి, ఎస్ ఆర్ జూనియర్ కాలేజ్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణము, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు వంటి వసతులను కల్పించాలని ఎమ్మెల్యే ని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో ఎంతో అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కూడా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులు కేటాయించి కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం క్రిస్టియన్ ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి వెంటనే పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ షాప్ ఇవ్వాలి, డిప్యూటీ ఎమ్మార్వో ప్రభుదాస్, బిఆర్ఎస్ పార్టీ ఎన్ఎంసి అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, రవికిరణ్, ఆగం రాజు, బొర్ర దేవి చందు ముదిరాజ్, ఏఈ ప్రవీణ్, వాటర్ వర్క్స్ డీజీఎం చంద్రమౌళి, మేనేజర్ సౌమ్య, ఎన్విరాన్మెంటల్ ఏఈ సూకృతా రెడ్డి, సర్వేయర్ లక్ష్మి, వివిధ శాఖల అధికారులు, పలు డివిజన్ల అధ్యక్షులు, స్థానిక నాయకులు, స్థానిక బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.