by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:29 PM
కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె నిరసనలో గా 20వ రోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధూంధాం కార్యక్రమంలో ఉద్యోగులు రోడ్డుపైన కోలాటాలు,నృత్యాలు, అసైదుల ఆటలతో మున్సిపల్ కార్యాలయం వద్ద ధూమ్ దాం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, తాము చేస్తున్న పోరాటంలో ఏ రాజకీయ నాయకులు లేరని సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటం స్వశక్తిదని ఇది దశాబ్దాల బానిసత్వానికి విముక్తి పొందడానికి చేస్తున్న ఆరాటమని అని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించుటకు ప్రభుత్వం కొంత సానుకూలత చూపించినప్పటికీ స్పష్టమైన స్పందన లేదని ఇప్పటికే విద్యా బోధన బంద్ చేసి రోడ్డు ఎక్కినాము మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మా పోరాటం శాంతియుతంగా చేస్తున్నామని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చకుంటే విద్యా వ్యవస్థలో విద్యార్థులకు జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యతని గుర్తు చేశారు. ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా సిపియాస్ సంఘం జిల్లా నాయకులు ఎల్లారెడ్డి భాస్కర్ రెడ్డి , టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమల్ రెడ్డి ఇన్నారెడ్డి వచ్చి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకుమీ వెంట ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి నాయకులు రాములు, శైలజ,సంతోష్ రెడ్డి వనజ,మంగా, శ్రీవాణి,శ్రీను, కాళిదాసు, కళ్యాణ్, లింగం, దినేష్, లావణ్య 500 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు.