by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:31 PM
పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన యువత నూతన ఉత్సవముతో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ పిలుపునిచ్చారు.ఆదివారం సంగెం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుగులోత్ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగిన నూతనంగా పరిచయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాస శ్రీధర్ హాజరై మాట్లాడారు.ముందుగా ఎన్నికైన పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ యువత, అన్ని గ్రామాల యూత్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు నిమిషాలు మౌనవ్రతం పాటించారు. అనంతరం నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిని మండల అధ్యక్షుడిని కమిటీ సభ్యులను యువజన కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలనుసారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.పరకాల నియోజకవర్గం లో అన్ని పాత కమిటీలను రద్దు చేసి నూతన కమిటీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసిందన్నారు.గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పందికొక్కుల్లాదిని రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు కాంగ్రెస్ని విమర్శిస్తే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను, ప్రజలపై జరిగిన దౌర్జన్యాలను యువత ప్రజలకు తెలియజేయాలని సూచించారు.