by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:14 PM
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాయితీపై మొక్కజొన్న విత్తనాలు పంపిణీ జరుగుతుంది. ఈ సందర్భంగా బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం ద్వారా 2024 - 25 సంవత్సరానికి యాసంగి సీజన్ లో భాగంగా అధిక దిగుబడిని ఇచ్చే బయోసీడ్ 9544 రకం మొక్కజొన్న విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
మండలంలో 25 హెక్టార్ల విస్తీర్ణం కొరకు గాను ఐదు కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయని, ఒక బస్తా ధర 875 రూపాయలు ఉంటుందని తెలిపారు. మొక్క జొన్న విత్తనాలు కావలసిన రైతులు పట్టాదార్ పాసుబుక్, ఆదార్ జిరాక్స్ కాపీలను కార్యాలయానికి తీసుకుని వచ్చి, వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించి పొందవచ్చునన్నారు. ఏఓ సంతోష్ తో పాటు ఏఈఓ లు రేణుక, విజయ్, తేజస్వి, శ్వేత, మౌనిక, భరత్, ఎల్లయ్య పలువురు రైతులు ఉన్నారు.