by Suryaa Desk | Sun, Dec 29, 2024, 06:58 PM
వికారాబాద్ జిల్లా లో నీ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని వారం రోజున జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు రోజుల టోకెన్ సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాట్లాడుతూ గ్రామాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యాన్ని, గ్రామాలను కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడి కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేసి, పదవీ విరమణ 10 లక్షల రూపాయల సౌకర్యం కల్పించి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బహుళ పని విధానం గ్రామపంచాయతీ కార్మికులకు అతి ప్రమాదకరమైనదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడపై ఉరితాడు లా మారిన మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 9500 కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేస్తుంటే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీకాలం గడిచిన గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
జీవో నెంబర్ 60 ప్రకారం క్యాటగిరి వైజ్ గా వేతనాలు ఇవ్వాలి కారోబార్లకు స్పెషల్ కేటగిరి కల్పించాలి.గ్రామపంచాయతీ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.గ్రామపంచాయతీ కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయ నర్సింలు అర్జున్ వెంకటయ్య పద్మమ్మ ఆశప్ప రాజు భాగ్యమ్మ భీమమ్మ సత్యమ్మ పరమేష్ అర్జున్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.