by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:00 PM
జగదేవపూర్ మండల కేంద్రములోనీ కస్తూర్భా పాఠశాలను ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మచ్చ బాబు ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన ఏర్పడి సంవత్సరం గడుస్తున్న పేద విద్యార్థుల విద్యా వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. మండలంలోని కస్తూర్బా పాఠశాలలో 209 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అని . ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశ్యం బడి బయట ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యను అందించడం కానీ దాదాపు గత 20 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠాలు భోదించే వారు లేక ఏమి చేయాలో తెలియని అయోమయంలో విద్యార్థులు ఉన్నారన్నారు.అలాగే పాఠశాలలో 39 మంది పదవ తరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్ కి పునాది లాంటి పదవ తరగతి పరీక్షలు కేవలం రెండు నెలల గడువు మాత్రమే ఉండడంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయులే రోడ్డుపై కూర్చుంటే చదువు చెప్పేది ఎవరని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రశ్నించారు. . అదేవిధంగా పిల్లలకు పాఠాలు జరగడం లేదు అని తెలుసుకుని విద్యార్థుల తల్లీదండ్రులు పిల్లలను ఇండ్లలోకి తీసుకెళ్లి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఇదే పరిస్థితి ఉంటే విద్యార్థుల జీవితాలు అంధకారం అవుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల హామీలను పునః పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు విధులకు వెంటనే హాజరు అయ్యి పాఠాలు భోధన చేసే విధంగా చూడాలని తెలిపారు...