by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:03 PM
తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ కొండపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటికీలాడింది. ఆదివారం కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవానికి హజరైన భక్తులు మధ్యాహ్నం తీగుల్ నర్సాపూర్ గ్రామం సమీపంలో ఉన్న శ్రీ కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. నైవేద్యం వండుకొని బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్లు మధ్య అమ్మవారి చెంతకు చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు.
అమ్మవారికి ఒడిబియ్యం వేసేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో ఈవో రవికుమార్, సిబ్బంది మహేందర్ రెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, సుధాకర్, హరి, చిన్నా, చంద్రం తదితరులు పాల్గొన్నారు...