by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:07 PM
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఏబీవీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకూరి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల ను నిరుద్యోగ యువతను ఉద్దరిస్తామని ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కనీసం విద్యాశాఖకు మంత్రిని నియమించక పోవడం సిగ్గుచేటు అని పేద విద్యార్థుల జీవితాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్య వ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యాశాఖను అలాగే కొనసాగించి విద్యా ర్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ హాస్టల్లు సమస్యల కుంపటిలా మారాయన్నారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏబీవీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్, కళాశాల అధ్యక్షులు సంజయ్ కృష్ణ, తులసిరం, నగర జాయింట్ సెక్రెటరీ యలమల హేమ సుందర్, సైదులు, శివ, రాజు, శివ మరియు తదితరులు పాల్గొన్నారు.