by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:09 PM
దలితులపైరోజురోజుకు ఏదో ఒక విధంగా పెరుగుతున్న దాడి జరుగుతున్న కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలు వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి,ఈ నెల 23 నరంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో మాదిగ జాతీ బిడ్డ ప్రధానోపాధ్యాయులు కాంబలపల్లి రాములు పై అయ్యప్ప స్వాముల దాడిని ఖండిస్తూన్నాంఅని ,దాడి చేసిన వారి పై తగిన చర్యలు తీసుకోవాలి అని,ఎం ఎస్ ఎఫ్ దేవరకొండ నియోజకవర్గం ఇన్చార్జ్ నల్ల శ్రీకాంత్ జాంభవ్ డిమైండ్ చేశారు.
మాదిగ ఉద్యోగులపై దాడులు చేస్తే, రాష్ట్రమంతట రాస్తారోకలు నిర్వహిస్తామని హెచ్చరించారు, భారతదేశంలో దళితులపై అంటరాని మూసుకులో ఇంక దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. ఘటనపై జిల్లా విద్య అధికారి, జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని, దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో గణేష్, నల్ల శివ, రాజేష్, రాజు కుమార్, తదితరులు పాల్గొన్నారు.