by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:21 PM
TG: సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంది మండలం ఉత్తర్ పల్లి గ్రామ శివారులో 30 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.