by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:21 PM
దేవరకొండ పట్టణంలో ఆదివారం నాడు వైష్ణవి పంక్షన్ హాల్ లో యాదవమహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడు కొండల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో 500 మంది పాల్గొన్నారు,ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి లొడంగిగోవర్థన్ యాదవ్ , కడారి అంజయ్య రాష్ట్ర నాయకులు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవులంతా ఐకమత్యంగా ఉండాలని రాజకీయంగా ఆర్థికపరంగా ముందంజలో ఉండాలని తెలియపరిచారు.ఈసమావేశంలో చందంపేట, నెరడుగొమ్ము మండలాల నూతన కమిటీని లను ఎన్నుకున్నారు.
నేరేడు కొమ్ము మండల అధ్యక్షునిగా గడ్డం వెంకటయ్య , చందంపేట మండల అధ్యక్షునిగా శవ్వ సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, కడారి అంజయ్య యాదవ్, రాజు యాదవ్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్విటి, రెండు మండలాలు యాదవులు తదితరులు పాల్గొన్నారు.