by Suryaa Desk | Mon, Dec 30, 2024, 04:24 PM
TG: అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందని ప్రశ్నించారు. 'పవన్‌కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించాడా? పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెవిలో చెప్పారేమో' అని సంజయ్ విమర్శలు చేశారు.