by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:02 PM
నెక్కొండ ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ 140 ఆవిర్భావ వేడుకలను నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట కోర్టు ఎజిపి అడ్వకేట్ బండి శివకుమార్ ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి సాయి కృష్ణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి బొమ్మెర బోయిన రమేష్ ఓబిసి సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్ల వెంకన్న యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ముద్రబోయిన శ్రీకాంత్ రామాలయ కమిటీ డైరెక్టర్ కొత్తకొండ గణేశ్ సంఘని వెంకన్న వడ్డే సంతోష్ వడ్డే సూర్యనారాయణ వనం ఏకాంతం మైనార్టీ నాయకులు ఎండి అఫ్జల్ ఎండి హమీద్ ఎండి అమీర్ ఈదునూరి ప్రభాకర్ దానబోయిన వీరస్వామి చోప్పరి మధు తదితరులు పాల్గొన్నారు.