by Suryaa Desk | Sun, Dec 29, 2024, 02:05 PM
తెలంగాణ గ్రామ పంచాయితీ సిబ్బంది నందరినీ పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని, జీఓ నెం. 51ని సవరించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలి. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి. బకాయి వేతనాల చెల్లించాలని తదితర సమస్యల పరిష్కారానికై గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్( జేఏసీ ) అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిశంబర్ 27-28 తేదిలలో రెండు రోజుల పాటు టోకెన్ సమ్మె పిలుపు నిచ్చింది.ఈ పిలుపులో భాగంగా మొదటి రోజు అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది. శనివారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈసందర్భంగా గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెళ్లి రవీందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజా లు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయితీల్లో సుమారు 60,000 మంది గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె పకృతి వనాలు, వైకుంఠధామాలు, డ్రైవర్లు, ఆఫీసు నిర్వహణ తదితర పనుల్లో వివిధ కేటగిరీల వారీగా పనులు చేస్తూన్నాం. గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు. 2018 సం||లో గత రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.51ని విడుదల చేసి సిబ్బంది వేతనాలను రూ.8,500/-లకు పెంచింది. వేతనాలు పెంచుతూనే పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్ళను బిగిస్తూ మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మల్టీపర్పస్ వర్కర్లుగా మార్చిన తరువాత ఎవరైనా ఏపనినైనా చేయాలనే నిబంధన పెట్టి కార్మికులపై ఒత్తిడి పెంచి బలవంతంగా పనులు చేయించడంతో అనేక మంది కార్మికులు ట్రాక్టర్ నడుపుతూ కరెంట్ సరఫరాలో పనులు చేస్తూ చనిపోయారని గత మూడు రోజుల క్రింద పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మల్టిపర్పస్ వర్కర్ కరెంట్ పోల్ ఎక్కి కింద పడడంతో కళ్ళు చేతులు విరిగి హాస్పిటల్ పాలు అయ్యారని అన్నారు.. ప్రమాదం జరిగిన కుటుంబాలకు ఇన్సూరెన్స్ కూడా నోచుకోని పరిస్థితి ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్మికుల ను రెగులర్ చేసి మల్టిపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో 2025 నూతన సంవత్సరం మొదటి వారంలోనే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అలాగే ఈ ధర్నాకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్) జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్,భారత విద్యార్థి సంఘం (ఎస్ఎఫ్ఐ)జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్,జిల్లాల ప్రశాంత్,లు పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది పనిచేస్తేనే గ్రామాలు శుభ్రంగా ఉంటాయని వారికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల లచ్చయ్య,రామచంద్రం,అశోక్,సహాయ కార్యదర్శులు శ్రీనివాస్,,జిల్లా కమిటీ సభ్యులు తిట్ల శ్రీనివాస్,ఆకుల రాజయ్య,,అంబాల లక్ష్మణ్,బూడిద రామస్వామి,రాజు, స్వామి,నాయకులు భానయ్య,ప్రేమకుమార్, అశోక్,ముస్తాపా,చంద్రయ్య, రఫీక్, స్వరూప, లక్ష్మి ,రాజేశం, నాయక్, లింగయ్య,మల్లేష్, కుమార్, రాములు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.