by Suryaa Desk | Sun, Dec 29, 2024, 07:02 PM
భూమి లేని ఉపాధి హమి,రైతు కూలీల కు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్ధిక సహయం అందజేసే పధకాన్ని ప్రవేశపెట్టి విధివిధానాలను రూపొందించి అమలు చేయాలని కోరుతూ శనివారం నాడు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు ఆద్వర్యంలో జగదేవ్ పూర్ ఎమ్ పి డి ఓ యాదగిరికి వినతిపత్రం ద్వారా ప్రభుత్వానికి తెలిపారు.
ఈ సందర్బంగా ఏగొండ స్వామి,వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హమిలో బాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో భూమి లేని ఉపాధి హమి రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఆర్ధిక సహయం అందజెస్తామని హమి ఇచ్చారు.మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కూలీల ఆర్ధిక సహయానికి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర బడ్హెట్ లో 1200 కొట్లను సైతం కేటాయించారు.ఇటివల డిప్యూటీ సియం గారు,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు కూలీల ఆర్ధిక సహయ పధకాన్ని డిసెంబరు 28 నుండి అమలు చెస్తామని వేర్వేరు గా ప్రకటించారు. ఈ ఫధకం అమలు కు నేటికి మార్గదర్శకాలను విడుదల చేయలేదు.కాని పత్రికలలో వివిధ కధనాల ప్రకారం భూమి లేని వారికి,ఉపాధి హమిలో వంద రోజులు పూర్తి చెసిన కూలీలకు మాత్రమే ఈ పధకం వర్తిస్తున్నది ప్రచారం జరుగుతుంది.కాని గత పదేళ్ళుగా బిజెపి అధ్వర్యంలో ని కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించడం,ఆన్ లైన్ హజరు NMMS,అధార్ బెసెడ్ పెమెంట్ పేరుతో ఉపాధి పధకాన్ని ఎత్తివేయాడానికి చెస్తున్న కుట్రలో బాగంగా కూలీలకు సక్రమంగా పనులు కల్పించడం లేదు.చెసిన పనికి సకాలంలో వేతనాలు అందడం లేదు.కనీస వేతనం చెల్లించకపొవడంతో ఉపాధి హమి కూలీలు ఉపాధి హమి పని పట్ల విముఖత చూపించాల్సిన పరిస్థితి కి నెట్టబడ్డారు.వందరోజుల పని లక్షాలాది కుటుంబాలకు అందలేదు. కేంద్ర ప్రభుత్వ Mgnregs వెబ్ సైట్ ప్రకారమే 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 1,34,963 లక్షల కుటుంబాల కు,2024-25 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 30,380(26-12-2024 నాటికి) వేల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారు.కనుక వందరోజుల ప్రతిపాదికన ఆర్ధిక సహయం అందజెస్తే లక్షలాది మంది కూలీలలు నష్టపొతారు.
ఈ నేపధ్యంలో దళిత బహుజన ఫ్రంట్ నిర్దిష్ట ప్రతిపాదనలను మీ ముందు వుంచుతున్నాం.
డిబిఎఫ్ ప్రతిపాదనలు
1). భూమిలేని మరియు ఒక ఎకరం లోపు భూమి వున్న కుటుంబాలకు ఈ పధకానికి ఎంపిక చేయాలి.
2). ఉపాధి హమి పధకం లో వంద రోజులు పూర్తి చెసిన వారికి పరిమితం చేయకుండా రాష్ట్రంలో 53 లక్షల ఉపాధి హమి జాబ్ కార్డులో పెర్లు వున్న 1.10 కోట్ల కూలీలకు అమలు చెయాలి.
3) విడతలో వారిగా కాకుండా ఒకెసారి 12 వేలు చెల్లించాలి.
4) పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏడాదికి ఒకసారి 12 వేలు కాకుండా ప్రతి నెల 3 వేల రూపాయలు చెల్లించాలని కొరుతున్నాం.
5) పట్టణ,మహిళ గృహ తదితర అసంఘటిత కార్మికుల కు ఈ పధకాన్ని వర్తింప చేయాలి.
6) గ్రామిణ ఉపాధి హమి కూలీలకు రైతుభీమా లాగా కూలీ భీమా పధకాన్ని అమలు చేయాలి....